Advertisement

వాట్సాప్ లో ఆధార్ డౌన్‌లోడ్: ఒక్క క్లిక్ తో సులభం

ఆధార్ ఇప్పుడు ఫిజికల్ గా వెంట ఉంచుకోవాల్సిన అవసరం లేదు. MyGov హెల్ప్‌డెస్క్ +91-9013151515 నంబర్‌కు వాట్సాప్ లో “హాయ్” లేదా “నమస్తే” పంపండి. చాట్ బాట్ ఓపెన్ అయ్యాక “డిజిలాకర్ సేవలు” ఎంచుకోండి. మీ 12 అంకెల ఆధార్ నెంబర్ నమోదు చేయండి. రిజిస్టర్డ్ మొబైల్ కు వచ్చిన OTP నమోదు చేసి వెరిఫై చేయండి.

వెరిఫికేషన్ తర్వాత అందుబాటులో ఉన్న పత్రాల జాబితా కనిపిస్తుంది. ఆధార్ పీడీఎఫ్ నేరుగా వాట్సాప్ లో డౌన్‌లోడ్ అవుతుంది. ఈ సేవ ఉపయోగించాలంటే మీ ఆధార్ డిజిలాకర్ ఖాతాకు లింక్ అయి ఉండాలి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ యాక్టివ్ గా ఉండాలి. ఒకేసారి ఒక పత్రం మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లింక్ చేయకపోతే, డిజిలాకర్ యాప్/వెబ్ సైట్ ద్వారా ముందుగా అప్‌డేట్ చేయండి.

Advertisement
Advertisement