Advertisement

Dost Notification 2026: నేడే డిగ్రీ నోటిఫికేషన్ విడుదల.. రిజిస్ట్రేషన్ వివరాలు

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ పూర్తిచేసిన విద్యార్థులకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TSCHE) గుడ్ న్యూస్ చెప్పింది. డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్ – DOST) 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్‌ను నేడు (ఏప్రిల్ 13, సోమవారం) ఉదయం 11:30 గంటలకు అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

ఏప్రిల్ 15 నుంచి విద్యార్థులు dost.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వెబ్ ఆప్షన్ల ద్వారా కాలేజీలు, కోర్సులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం మూడు విడతల్లో (Phases) మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు జరగనుంది. సర్వర్ సమస్యలు రాకుండా ఉండేందుకు, నోటిఫికేషన్ విడుదలైన వెంటనే విద్యార్థులు రిజిస్ట్రేషన్ ప్రారంభించడం ఉత్తమం.

Advertisement

ముఖ్యమైన తేదీలు

వివరాలుతేదీ & సమయం
నోటిఫికేషన్ విడుదలనేడు (ఏప్రిల్ 13, 2026) – ఉదయం 11:30
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభంఏప్రిల్ 15, 2026
వెబ్ ఆప్షన్ల ప్రారంభంరిజిస్ట్రేషన్ ముగిసిన వారం తర్వాత
కౌన్సెలింగ్ విధానం3 విడతల్లో (Phases) సీట్ల భర్తీ
అధికారిక వెబ్‌సైట్dost.telangana.gov.in

IMPORTANT LINKS

Advertisement