మన పత్రిక వెబ్డెస్క్, జగిత్యాల: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి ఏకపక్షంగా సాగిన ఈ ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు.
ధర్మపురి మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు ఉండగా.. ఇప్పటి వరకు అధికారికంగా 10 వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి. ఆశ్చర్యకరంగా ఈ 10 స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులే ఘనవిజయం సాధించి క్లీన్ స్వీప్ చేశారు. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు ఇక్కడ కనీసం ఖాతా తెరిచే అవకాశం కూడా దక్కలేదు.
ఇంకా 5 వార్డుల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ (8 సీట్లు)ను దాటేసింది. దీంతో ధర్మపురి మున్సిపల్ పీఠం హస్తం పరం కావడం ఖాయమైంది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బలమైన స్థానిక నాయకత్వమే ఈ ఏకపక్ష విజయానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ అద్భుత విజయంతో ధర్మపురి పురవీధుల్లో పండగ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలు రంగులు చల్లుకుంటూ, బాణసంచా కాలుస్తూ భారీ ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
