మన పత్రిక వెబ్‌డెస్క్, హైదరాబాద్: ధరణి పోర్టల్‌లో భూముల రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకుని, వివిధ కారణాలతో రద్దు చేసుకున్న రైతులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. స్లాట్ క్యాన్సిల్ చేసుకున్న రైతులకు తిరిగి ఇవ్వాల్సిన స్టాంప్ డ్యూటీ సొమ్మును రెవెన్యూ శాఖ ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెట్టింది. ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 26,740 మంది రైతులకు సంబంధించిన రూ. 87.60 కోట్లను ప్రభుత్వం తన వద్దే అట్టిపెట్టుకుంది. అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, కాలేరు వెంకటేశ్ అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం ఇచ్చిన రాతపూర్వక సమాధానంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
వంద కోట్లు వసూలు.. ఇచ్చింది 13 కోట్లే 2020-21 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరాల మధ్య మొత్తం 31,314 మంది రైతులు స్లాట్లను క్యాన్సిల్ చేసుకున్నారు. వీరు స్టాంప్ డ్యూటీ కింద ప్రభుత్వానికి రూ. 100.58 కోట్లు చెల్లించారు. అయితే, టెక్నికల్ కారణాలు సాకుగా చూపుతూ ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం 4,574 మంది రైతులకు మాత్రమే రూ. 13 కోట్లు రిఫండ్ చేసింది. ఇంకా రూ. 87 కోట్లకు పైగా బకాయిలు ప్రభుత్వం వద్దే ఉండిపోయాయి. కేవలం కోర్టుల్లో కేసులు వేసిన వారికి మాత్రమే రిఫండ్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మారని తీరు.. రైతుల ఆవేదన ధరణి దోపిడీపై పోరాడి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనూ ఈ జాప్యం కొనసాగుతోంది. 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో వేల సంఖ్యలో రైతులు స్లాట్లు రద్దు చేసుకున్నా వారికి కూడా ఇంకా డబ్బులు అందలేదు. ధరణి పోయినా, కొత్తగా వచ్చే భూభారతిలోనైనా ఈ సమస్య తీరుతుందా అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతుల డిమాండ్ ఇదే ప్రస్తుతం స్లాట్ బుక్ చేసుకునే సమయంలోనే స్టాంప్ డ్యూటీని వసూలు చేస్తున్నారు. దీనివల్ల స్లాట్ క్యాన్సిల్ అయితే డబ్బులు వెనక్కి రావడం కష్టంగా మారుతోంది. దీనిని మార్చి, రిజిస్ట్రేషన్‌కు గంట ముందు మాత్రమే స్టాంప్ డ్యూటీ కట్టించుకునే విధానాన్ని తీసుకురావాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అప్పుడే స్లాట్ రద్దయినా ఆర్థిక నష్టం ఉండదని సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
