Advertisement
devarakonda mandal

Devarakonda: నిండు గర్భిణీని స్ట్రెచర్‌పై వాగు దాటించిన 108 సిబ్బంది!

మన పత్రిక, వెబ్​డెస్క్: మొంథా తుఫాన్ (cyclone montha) కారణంగా కురుస్తున్న భారీ వర్షాల మధ్య 108 సిబ్బంది సాహసం చేశారు. దేవరకొండ మండలం (Devarakonda mandal) మడమడక గ్రామానికి చెందిన జట్టి దేవి అనే నిండు గర్భిణీకి బుధవారం ఉదయం పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి.

Advertisement

కుటుంబ సభ్యులు 108కి కాల్ చేయగా, చింతపల్లి 108 సిబ్బంది రవి నాయక్, సైదులు సంఘటనా స్థలానికి బయల్దేరారు. అయితే, మార్గమధ్యంలోని మైనంపల్లి వాగు భారీ వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో, సిబ్బంది ధైర్యంగా ఆ మహిళను స్ట్రెచర్ సహాయంతో వరద ప్రవహిస్తున్న వాగును దాటించారు. అనంతరం ఆమెను క్షేమంగా దేవరకొండ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement