Advertisement

ఆందోల్ నియోజకవర్గంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలి: మంత్రి దామోదర రాజనర్సింహ

మన పత్రిక, ఆందోల్: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Damodar Rajanarasimha) ఆందోల్ నియోజకవర్గంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియను వంద శాతం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని పలు మండలాలు మరియు జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి ఏజెంట్లతో మంత్రి ప్రత్యేక సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఓటరు జాబితాలో తప్పులు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా ఏజెంట్లు బాధ్యత తీసుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు. బూత్ స్థాయి అధికారులు (BLO) మరియు ఏజెంట్లు సమన్వయంతో పనిచేస్తూ, రోజువారీ లక్ష్యాలను చేరుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. భారత ఎన్నికల సంఘం నిర్ణయించిన ప్రకారం జూలై 24వ తేదీలోపు డేటా డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన పార్టీ నాయకులకు సూచించారు.

Advertisement