CSIR IICT HYDERABAD JOB NOTIFICATION : సీఎస్ఐఆర్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT), హైదరాబాద్ లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 10 ఖాళీలు ఉన్నాయి. రిసెర్చ్ అసోసియేట్, ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్-2, ప్రాజెక్ట్ అసిస్టెంట్-1 & 2 పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు పోస్టుల ప్రకారం ఉంటాయి. సంబంధిత విభాగాల్లో బీటెక్, ఎంటెక్ లేదా బీఎస్సీతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి పోస్టుల ప్రకారం 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం పోస్టును బట్టి రూ.20,000 నుంచి రూ.58,000 వరకు ఉంటుంది. రిసెర్చ్ అసోసియేట్ కు రూ.58,000, ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్ కు రూ.49,000, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ కు రూ.42,000, ప్రాజెక్ట్ అసోసియేట్-2 కు రూ.35,000, ప్రాజెక్ట్ అసోసియేట్-1 కు రూ.25,000-31,000, ప్రాజెక్ట్ అసిస్టెంట్ కు రూ.20,000 ఉంటుంది.
ఎంపిక విధానం ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది. ఇంటర్వ్యూ తేదీ సెప్టెంబర్ 26, 2025. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు CSIR-IICT, హబ్సిగూడ, హైదరాబాద్ – 500007 చిరునామాకు రావాలి.
మరింత సమాచారం కోసం https://www.iict.res.in/CAREERS సందర్శించండి.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

