మన పత్రిక వెబ్‌డెస్క్, హైదరాబాద్: టాలీవుడ్‌లో ఓ సరికొత్త క్రేజీ కాంబినేషన్ సెట్ అయ్యింది. వరుస సినిమాలతో దూసుకెళ్తున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran), వెర్సటైల్ డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రానికి ‘క్రేజీ కళ్యాణం( Crazy Kalyanam )’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఆరో సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 2గా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్‌ను మేకర్స్ ఈ రోజు (జనవరి 5) అధికారికంగా ప్రకటించారు. 100 శాతం ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
బద్రప్ప గాజుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. టైటిల్‌కు తగ్గట్టే కాస్టింగ్ కూడా ఆసక్తికరంగా ఉంది. సీనియర్ నటుడు నరేష్ వీకే, ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్ రాజ్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం.. టైటిల్, కాంబినేషన్ రెండూ వైవిధ్యంగా ఉండటంతో ఆడియన్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇక అనుపమ పరమేశ్వరన్ కెరీర్ విషయానికొస్తే.. ఆమె జోరు మామూలుగా లేదు. గతేడాది (2025) డ్రాగన్, పరదా, కిష్కింధపురి, బైసన్ వంటి ఏడు సినిమాలతో రికార్డు సృష్టించిన ఈ భామ, 2026లోనూ అదే దూకుడు కొనసాగిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలోనే ‘క్రేజీ కళ్యాణం’తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
ఇవి కూడా చదవండి :
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
- బెంగళూరు: 2 నిమిషాలు లేటని విద్యార్థికి ఎండలో శిక్ష
- ఇరాన్ క్షిపణి దాడులు: దుబాయ్ ఎయిర్పోర్ట్ మూసివేత
