మన పత్రిక, వెబ్‌డెస్క్
TELANGANA CPGET 2025 COUNSELLING SCHEDULE : తెలంగాణ రాష్ట్రంలోని 9 యూనివర్సిటీల పరిధిలోని పీజీ కళాశాలల్లో CPGET 2025 మొదటి దశ కౌన్సిలింగ్ షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం రిజిస్ట్రేషన్, సీట్ కేటాయింపు, రిపోర్టింగ్ తేదీలు నిర్ణయించారు. CPGET 2025 ఫలితాలు మరియు ర్యాంకు కార్డులను ఇటీవల విడుదల చేశారు. మొదటి దశ కౌన్సిలింగ్ కోసం రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 10 నుంచి 15 వరకు అందుబాటులో ఉంటుంది.
సెప్టెంబర్ 18న అభ్యర్థులు దరఖాస్తులో సవరణలు చేసుకునే అవకాశం ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ ఎంపిక సెప్టెంబర్ 18 నుంచి 20 వరకు చేయవచ్చు. ఆ తర్వాత సెప్టెంబర్ 20న వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. మొదటి దశ సీట్ కేటాయింపు సెప్టెంబర్ 24న జరుగుతుంది. సీటు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 27 లోపు కేటాయించిన కళాశాలలో హాజరు కావాలి. పత్రాల ధృవీకరణ మరియు ప్రవేశ ఫీజు చెల్లింపు అప్పుడే పూర్తి చేయాలి. ( TG CPGET 2025 COUNSELLING SCHEDULE )
రెండో దశ కౌన్సిలింగ్ కోసం రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 29 నుంచి ప్రారంభమవుతుంది.
అప్ డేట్స్ కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://cpget.ouadmissions.com/ ను సందర్శించాలి.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
