న్యూఢిల్లీలోని ప్రసార భారతి వివిధ కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. కంటెంట్ మేనేజర్, క్రియేటివ్ డిజైనర్, వీడియో ఎడిటర్, ఐటీ ఎగ్జిక్యూటివ్, మేనేజర్, జూనియర్ మేనేజర్, ఫైనాన్స్ ప్లానర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులు సోర్సింగ్, ఆపరేషన్స్, ప్రొడక్షన్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ తదితర విభాగాల్లో ఉన్నాయి.
ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 24, 2025 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల ప్రకారం డిప్లొమా, డిగ్రీ, పీజీ లేదా సీఏ/సీఎంఏతో పాటు సంబంధిత ఉద్యోగానుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి ఐటీ ఎగ్జిక్యూటివ్, జూనియర్ మేనేజర్ పోస్టులకు 40 ఏళ్లు, ఇతర పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.40,000 నుంచి రూ.80,000 వరకు వేతనం చెల్లిస్తారు.
ఎంపిక ప్రక్రియలో టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఉంటుంది. షార్ట్ లిస్ట్ అయిన వారికి మాత్రమే ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు. మరింత సమాచారం కోసం https://prasarbharati.gov.in సందర్శించండి.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

