Advertisement

భారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర

మన పత్రిక: ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధర మరోసారి భారీగా పెరిగింది. 19 కేజీల సిలిండర్‌పై రూ.195.50 పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే గత నెలలోనే రూ.115 పెంపు జరిగిన విషయం తెలిసిందే. వరుస పెరుగుదలలతో హోటళ్లు, చిన్న వ్యాపారులపై భారం మరింత పెరుగుతోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావంతో గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దేశంలో ఎల్పీజీ కొరత తలెత్తడంతో ధరలు పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల మార్పులు కూడా దేశీయ రేట్లపై ప్రభావం చూపుతున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని పెరుగుదలలు ఉండే అవకాశముందని భావిస్తున్నారు.

Advertisement