మన పత్రిక: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య అలర్ట్ జారీ అయింది. ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఇవాళ బ్యాంక్ బ్రాంచ్ సేవలు నిలిపివేయనున్నారు. బ్యాంకులు ఓపెన్‌గా ఉన్నప్పటికీ, ఖాతాదారులకు సంబంధించిన లావాదేవీలు అందుబాటులో ఉండవు. వార్షిక ఖాతాల ముగింపు, లెక్కల సరిపోలిక వంటి కీలక పనులను పూర్తి చేయాల్సి ఉండటంతో సిబ్బంది పూర్తిగా అంతర్గత కార్యకలాపాల్లో నిమగ్నమవుతారు. ఈ కారణంగా నగదు జమ, విత్‌డ్రాయల్ వంటి సేవలు బ్రాంచ్‌లలో అందుబాటులో ఉండవు. అయితే మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎంల ద్వారా సేవలు యథావిధిగా కొనసాగుతాయి. ఖాతాదారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని లావాదేవీలు ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఏప్రిల్ 2న బ్యాంకులు సాధారణంగా పనిచేస్తాయి. కాగా ఏప్రిల్ 3న గుడ్ ఫ్రైడే సందర్భంగా మళ్లీ బ్యాంకులకు సెలవు ఉంటుంది.
ఇవి కూడా చదవండి :
- హైదరాబాద్‌లో పడిపోయిన రియల్ ఎస్టేట్: కొనుగోలుదారులు లేక ఖాళీగా ఫ్లాట్లు
- Petrol Diesel price hike : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: దిల్లీలో రూ. 100 దాటిన రేటు
- నేటితో ముగియనున్న టీజీ దోస్త్ సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల గడువు
- తెలంగాణలో తొలి గాజు వంతెన.. హుస్నాబాద్‌లో ముమ్మరంగా పనులు
- బండ్లగూడలో తప్పిపోయిన నాలుగేళ్ల చిన్నారి గుర్తింపు..
