Advertisement

బాడీగార్డ్ పై సీఎం రేవంత్ చేయి చేసుకున్నారా? వైరల్ అవుతున్న వీడియో!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎం దంపతులు గోవు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో, జనం ఒక్కసారిగా ముందుకు రావడంతో సీఎం తన భద్రతా సిబ్బంది (బాడీగార్డ్)పై చేయి చేసుకున్నారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

మరోవైపు, గోపూజ సమయంలో సీఎం షూలు ధరించి ప్రదక్షిణలు చేయడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులైన సెక్యూరిటీ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించడం సరికాదని, గోమాత పవిత్రతను పాటించలేదని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ వీడియో ఎప్పటిది? ఎక్కడ జరిగింది? అనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Advertisement
Advertisement