మన పత్రిక, వెబ్‌డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి ఓయూ పర్యటన: కోదండరామ్ తిరిగి ఎమ్మెల్సీ అవుతారు
CM Revanth News Kodandaram as MLC
సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా కొత్త హాస్టళ్లు, డిజిటల్ లైబ్రరీ రూమ్‌లను ప్రారంభించారు. మరో రెండు హాస్టళ్లకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రొఫెసర్ కోదండరామ్‌ను మరో 15 రోజుల్లో తిరిగి ఎమ్మెల్సీగా చేసి శాసన మండలికి పంపుతామని ప్రకటించారు.
బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టు వరకు వెళ్లి కోదండరామ్ పదవిని తీసివేయించారని, దీనిపై రూ. కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు.
ఉస్మానియా యూనివర్సిటీని గొలుస్తూ, “1938 సాయుధ రైతు ఉద్యమానికి ఊపిరి పోసింది ఓయూ” అని చెప్పారు. శివరాజ్ పాటిల్, పీవీ నర్సింహారావు, జైపాల్ రెడ్డి వంటి ప్రముఖులు ఇక్కడి విద్యార్థులేనని గుర్తు చేశారు.
తెలంగాణ ఉద్యమంలో మొదటి అమరుడు శ్రీకాంతాచారి కూడా ఓయూ విద్యార్థియే అని పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో ఓయూను నిర్వీర్యం చేసే ప్రయత్నం జరిగిందని మండిపడ్డారు. యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకురావడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
- Rain Holiday: స్కూళ్లకు సెలవులు పొడిగింపు..
- TG News: సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే!
- Nizamabad: ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం.. అధికారికి కలెక్టర్ షోకాజ్ నోటీసు!
- Prakasam Barrage: వరద.. మొదటి ప్రమాద హెచ్చరిక! 6 లక్షలకు చేరే ఛాన్స్.
- Youtube : భారీగా ఉద్యోగుల తొలగింపు.. పొమ్మనకుండా పొగబెడుతున్న యూట్యూబ్
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

