మన పత్రిక, వెబ్‌డెస్క్: కృష్ణా, గోదావరి నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడటంలో ఎక్కడా రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెగేసి చెప్పారు. జ్యోతీరావు పూలె ప్రజాభవన్‌లో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PPT) అనంతరం సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ, వ్యూహాత్మకంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వం చేసిన అన్యాయాలివే:
Advertisement
- వాటాల్లో గండి: ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయిస్తే, విభజన తర్వాత ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు చాలని అప్పటి ప్రభుత్వం అంగీకరించిందని సీఎం మండిపడ్డారు.
- పరీవాహక ప్రాంతం: అంతర్జాతీయ సూత్రాల ప్రకారం తెలంగాణకు 71%, ఏపీకి 29% వాటా దక్కాలి. కానీ గత సర్కార్ ఏపీకి 66%, తెలంగాణకు 34% నిష్పత్తికి ఒప్పుకుని ద్రోహం చేసిందని ఆరోపించారు.
- పాలమూరు-రంగారెడ్డి: ఈ ప్రాజెక్టు ఇన్‌టేక్ పాయింట్‌ను జూరాల నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్‌కు మార్చడం వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ప్రస్తుతం ఏపీ 13 టీఎంసీలు తరలిస్తుంటే, మనం కనీసం 2.5 టీఎంసీలు కూడా తీసుకోలేని పరిస్థితి ఉందన్నారు.
- సుప్రీం అఫిడవిట్: రూ.27 వేల కోట్లు ఖర్చు చేసినా, డీపీఆర్ లేకపోవడంతో పర్యావరణ అనుమతులు రాలేదని, పైగా ఇది సాగునీటి ప్రాజెక్టు కాదు.. కేవలం తాగునీటి ప్రాజెక్టు అని సుప్రీంకోర్టులో గత ప్రభుత్వం అఫిడవిట్ వేసిందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
