Advertisement
Revanth reddy delhi tour

ఢిల్లీకి సీఎం రేవంత్.. డీసీసీ అధ్యక్షుల ఎంపికపై కీలక భేటీ!

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) ఈ రోజు రాత్రి ఢిల్లీకి పయనం కానున్నారు. రాష్ట్రంలో డీసీసీ అధ్యక్షుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించేందుకు ఆయన దేశ రాజధానికి వెళ్తున్నారు.

Advertisement

రేపు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఈ అంశంపై కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ( TPCC Chief Mahesh Kumar Goud ) , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka ) , ఇతర ముఖ్య నేతలు పాల్గొననున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు ఢిల్లీలోనే బస చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉందని సమాచారం.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement