Advertisement

ఇందిరమ్మ క్యాంటీన్లపై సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగం

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ క్యాంటీన్ల (Indiramma Canteen) ద్వారా పేదలకు నాణ్యమైన భోజనం అందుతోంది. క్యాంటీన్లలో భోజనం నాణ్యతను అభినందిస్తూ ఒక యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రజల ఆకలి తీర్చడం తనకు ఎంతో సంతృప్తిని ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.

పేద ప్రజల ముఖాల్లో చిరునవ్వు చూడటమే ప్రభుత్వ అసలైన విజయమని సీఎం వ్యాఖ్యానించారు. ట్విట్టర్ (X) వేదికగా స్పందిస్తూ, ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ప్రాంతాలకు ఈ క్యాంటీన్లను విస్తరిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. పేదలకు మెరుగైన సేవలు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.

Advertisement
Advertisement