Advertisement

టీచర్స్ డే సందర్భంగా సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

మన పత్రిక, వెబ్​‌డెస్క్

Advertisement

అమరావతి: భావితరాల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) అన్నారు. ఈ సందర్భంగా ఆయన సామాజిక మాధ్యమం x ద్వారా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు నివాళులు అర్పించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆదర్శాల నుంచి స్ఫూర్తిని పొందుతూ ఎందరో మహానుభావులు ఉపాధ్యాయ వృత్తికి పునరంకితమౌతున్నారని అన్నారు.

Advertisement

పిల్లల్లో విజ్ఞాన జ్యోతులు వెలిగిస్తున్న టీచర్లందరకీ చంద్రబాబు అభినందనలు తెలిపారు. అదే అంకితభావంతో పనిచేస్తూ భవిష్యత్ తరాలకు మార్గదర్శకులు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. టీచర్స్ డే(Teachers Day) సందర్భంగా నేడు సాయంత్రం విజయవాడలో జరిగే ఉపాధ్యాయ దినోత్సవం వేడుకల్లో సీఎం పాల్గొననున్నారు.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement