Advertisement

గానకోకిల ఎస్. జానకి మృతికి సీఎం చంద్రబాబు సంతాపం

మన పత్రిక, అమరావతి: ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి (S Janaki) మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతీయ సినీ సంగీత ప్రపంచానికి ఆమె మరణం తీరని లోటని ఆయన పేర్కొన్నారు. తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో వేలాది పాటలు పాడి, తన గాన మాధుర్యంతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారని కొనియాడారు.

ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో అద్భుతమైన ప్రయాణం సాగించిన ఆమె సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి అభివర్ణించారు. కర్నాటకలోని మైసూరులో జరగనున్న ఆమె అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని కర్నాటక ప్రభుత్వాన్ని ఆయన కోరారు. జానకి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆమె అమరగీతాలు సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని సీఎం చంద్రబాబు (Chandrababu Naidu) పేర్కొన్నారు.

Advertisement
Advertisement