మన పత్రిక, వెబ్‌డెస్క్: ప్రముఖ క్లౌడ్, సీడీఎన్ సర్వీస్ ప్రొవైడర్ ‘క్లౌడ్‌ఫ్లేర్’లో (Cloudflare) సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా పలు ప్రధాన వెబ్‌సైట్లు, యాప్‌ల సేవలు నిలిచిపోయాయి. ముఖ్యంగా ఎక్స్ (ట్విట్టర్), ఓపెన్ ఏఐ, పేపాల్, ఉబర్ వంటి దిగ్గజ సంస్థల సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.37 గంటల నుంచి ఈ సమస్య మొదలైనట్లు డౌన్‌డిటెక్టర్ వెల్లడించింది. వెబ్‌సైట్లను ఓపెన్ చేస్తుంటే ‘ఎర్రర్ కోడ్ 500’ అని వస్తోందని, ఎక్స్‌లో ఫీడ్ రీఫ్రెష్ కావడం లేదని, పోస్టులు పెట్టలేకపోతున్నామని యూజర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై క్లౌడ్‌ఫ్లేర్ స్పందించింది. తమ బృందం లోపాన్ని సరిదిద్దే పనిలో ఉందని, త్వరలోనే సేవలను పునరుద్ధరిస్తామని వెల్లడించింది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్‌తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
Advertisement
