మన పత్రిక, హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి తన ఉదారతతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక ‘ఎన్టీఆర్ జాతీయ పురస్కారం’తో పాటు తనకు అందిన రూ.10 లక్షల నగదును ఆయన వివిధ స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ప్రకటించారు.
సామాజిక బాధ్యతగా ఈ మొత్తాన్ని సర్వ్, దేవనార్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్, వాల్మీకి, నయశ్రీ ఫౌండేషన్లకు అందజేశారు. వీటితో పాటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ చిన్నారి వైద్యం కోసం కూడా ఆర్థిక సాయం అందించారు. శుక్రవారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సేవా కార్యక్రమాలు చేపట్టడం విశేషం. తన కుమారుడి జన్మదినం నాడు ఆపన్నులకు అండగా నిలవడంపై అభిమానులు, నెటిజన్లు చిరంజీవిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
