WhatsApp
Advertisement

GMAIL: వినియోగదారులకు గూగుల్ హెచ్చరిక

మన పత్రిక, వెబ్​డెస్క్

Google gmail data breach warning – జీమెయిల్ వినియోగదారులు వెంటనే తమ పాస్‌వర్డ్‌ను మార్చుకోవాలని గూగుల్ స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 250 కోట్ల మంది జీమెయిల్ ఖాతాల భద్రత ప్రమాదంలో ఉందని గూగుల్ హెచ్చరించింది. ఈ ప్రమాదానికి కారణం సేల్స్‌ఫోర్స్ డేటా బ్రీచ్ అని గూగుల్ తెలిపింది. 2025 జూన్ ప్రథమార్థంలో జరిగిన ఈ ఘటన తర్వాత హ్యాకర్స్ వినియోగదారుల సమాచారాన్ని పొందినట్లు సమాచారం.

Advertisement

హ్యాకర్స్ ఇప్పుడు వినియోగదారులకు కాల్స్ మరియు మెసేజ్‌లు పంపుతూ పాస్‌వర్డ్ రీసెట్ చేయమని లేదా లాగిన్ కోడ్స్ ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సందేశాలకు స్పందించకుండా ఉండాలని గూగుల్ స్పష్టం చేసింది. ఈ పరిస్థితి నేపథ్యంలో జీమెయిల్ పాస్‌వర్డ్‌ను తక్షణమే మార్చుకోవడం చాలా ముఖ్యం. బలమైన పాస్‌వర్డ్ మరియు రెండు-దశల ధృవీకరణను ఉపయోగించమని గూగుల్ సూచిస్తోంది.

Advertisement