మన పత్రిక, వెబ్‌డెస్క్
సిద్దిపేట్ ( SIDDIPET ) జిల్లా చిన్నకోడూరు మండలంలోని చందులాపూర్ ( chandulapur ) గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ముసుగు దొంగల వీరంగం చోటుచేసుకుంది. రాత్రి 11 గంటల సమయంలో బీసీ కాలనీలో ముగ్గురు ముసుగు ధరించిన దొంగలు రెండు ఇళ్లపై దాడి చేయడానికి ప్రయత్నించారు. నల్ల బట్టలు ధరించి బైక్ పై వచ్చిన దొంగలు గేట్లు దూకే ప్రయత్నం చేశారు. గ్రామ యువకులు కేకలు వేయడంతో వారు రాళ్లతో దాడి చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వెంటనే పరారయ్యారు.
గ్రామంలో వీధి దీపాలు లేకపోవడంతో చీకటి ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. గతంలో గ్రామస్థులు వీధి దీపాల కోసం అధికారులకు, విలేజ్ సెక్రటరీకి అనేకసార్లు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు స్పందన లేదు. యువకులు వెంటనే వినాయకుల వద్దకు వచ్చిన పెట్రోలింగ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇటీవల మండలంలో రైల్వే పనుల కోసం ఉత్తర భారత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్ నుండి వచ్చిన కూలీలు పనిచేస్తున్నారు. ఈ దొంగతనానికి వారే సంబంధించి ఉంటారని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో భయం నెలకొంది. భద్రతపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
