మన పత్రిక, వెబ్‌డెస్క్: పెండింగ్ బిల్లులు, జీతాల పెంపు డిమాండ్‌తో మాజీ సర్పంచులు, ఆశా కార్యకర్తలు తలపెట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. సూర్యాపేట నుంచి అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన పలువురు నాయకులను, ఆశా వర్కర్లను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. దీంతో అక్కడ వాతావరణం వేడెక్కింది.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామని, ఆశా వర్కర్ల జీతాలు పెంచుతామని హామీ ఇచ్చి.. ఇప్పుడు విస్మరించిందని వారు మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా హక్కుల కోసం పోరాడుతుంటే అరెస్టులు చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
