Advertisement
hyderabad 2000 new electric buses

TG News: హైదరాబాద్‌కు 2,000 బస్సులు కేటాయింపు!

10,900 విద్యుత్ బస్సుల టెండర్.. హైదరాబాద్‌కు 2,000 బస్సులు!

Advertisement

మన పత్రిక, వెబ్​డెస్క్: దేశవ్యాప్తంగా పలు నగరాల కోసం 10,900 విద్యుత్ బస్సులను సేకరించేందుకు ప్రభుత్వ రంగ సంస్థ కన్వెర్జెన్స్‌ ఎనర్జీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (సీఈఎస్‌ఎల్‌) నవంబర్ 6న బిడ్లు ఓపెన్ చేయనుంది. సున్నా ఉద్గారాల ప్రజా రవాణాను ప్రోత్సహించే నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రామ్ (NEBP) కింద ఇది కీలక మైలురాయిగా నిలవనుంది. ఈ టెండర్ ద్వారా హైదరాబాద్‌తో పాటు సూరత్, అహ్మదాబాద్, ఢిల్లీ, బెంగళూరు నగరాలకు బస్సులను సేకరించనున్నారు. మొత్తం బస్సుల్లో హైదరాబాద్‌కు 2,000, ఢిల్లీకి 2,800, బెంగళూరుకు 4,500, సూరత్‌కు 1,600, అహ్మదాబాద్‌కు 1,600 బస్సులు కేటాయించే అవకాశం ఉంది.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement