Advertisement

Apps: 87 యాప్‌లు బ్యాన్.. కారణాలివే!

మన పత్రిక, వెబ్​డెస్క్: డిజిటల్ రుణ యాప్‌ల ఆగడాలపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ప్రజలను వేధింపులకు గురిచేస్తూ, చట్టవిరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్న 87 అనధికార లోన్ యాప్‌లను (Loan Apps) నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సైబర్ మోసాలు, అధిక వడ్డీ వసూళ్లు, కస్టమర్ల పట్ల వేధింపుల ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కేంద్రం ఈ చర్యకు ఉపక్రమించింది.

ఆర్బీఐ (RBI), ఐటీ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన సమగ్ర సమీక్ష అనంతరం ఈ అనధికార యాప్‌ల భరతం పట్టారు. డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్‌లపై పర్యవేక్షణను ఇకపై మరింత కఠినతరం చేయనున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement