Advertisement

BRAOU: 2025-26 డిగ్రీ, పీజీ కోర్సులకు గడువు సెప్టెంబర్ 12 వరకు పొడిగింపు

braou admission extension: డా. బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) 2025-26 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లొమా మరియు సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును సెప్టెంబర్ 12, 2025 వరకు పొడిగించింది. ఆసక్తి గల విద్యార్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అలాగే, 2023-24, 2024-25 విద్యా సంవత్సరాల్లో డిగ్రీ కోర్సుల్లో చేరి, రెండవ లేదా మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, అలాగే గతంలో డిగ్రీ లేదా పీజీ కోర్సుల్లో చేరి సకాలంలో ఫీజు చెల్లించని వారు కూడా సెప్టెంబర్ 12లోపు ఆన్‌లైన్ లో ట్యూషన్ ఫీజు చెల్లించే అవకాశం కల్పించారు.

Advertisement

విద్యార్థులు ప్రవేశాలు మరియు ఫీజు చెల్లింపు సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ https://braou.ac.in/ ను సందర్శించవచ్చు.

Advertisement