Bihar Assembly Elections : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి దశ ఓటింగ్ ఇవాళ ప్రారంభం అయింది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ స్టార్ట్ అయింది. రాష్ట్రంలోని 18 జిల్లాల్లో ఉన్న 121 నియోజకవర్గాల్లో తొలి విడతలో భాగంగా ఎన్నికలు జరుగుతున్నాయి.
తొలి విడతలో 1314 మంది అభ్యర్థులు పోటీ చేశారు. తొలి విడతలో 3.75 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఎంతమంది ఓట్లు వేస్తారో చూడాలి. రాష్ట్ర వ్యాప్తంగా 45,341 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈసారి ఓటర్లు కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చి ఓట్లు వేస్తున్నారు. దీంతో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచే ఓటర్ల క్యూ కనిపిస్తోంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
