WhatsApp
Advertisement

చలి కోసం బొగ్గుల కుంపటి.. చిన్నారులు సహా నలుగురు మృతి

మన పత్రిక, వెబ్​డెస్క్: బీహార్‌లోని ఛాప్రాలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. చలి తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు గదిలో బొగ్గుల కుంపటి పెట్టుకుని నిద్రించిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు పసిపిల్లలు, ఒక వృద్ధురాలు ఉండటం స్థానికులను కలచివేసింది.

గది తలుపులన్నీ మూసి ఉండటంతో బొగ్గుల నుంచి వెలువడిన ప్రమాదకర కార్బన్ మోనాక్సైడ్ వాయువు గది అంతా వ్యాపించింది. నిద్రలోనే ఆ విషవాయువును పీల్చడంతో వారంతా ఊపిరాడక, స్పృహ కోల్పోయి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇదే ఘటనలో మరో ముగ్గురు అస్వస్థతకు గురికాగా, వారి పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement
Advertisement