Advertisement

రీతూ చౌదరిపై మహేశ్ ఫైర్! ఇల్లు ఖాళీ చేయించింది

రీతూ చౌదరి ( Rithu Chowdary ) బిగ్‌బాస్ హౌస్‌లో పవన్ కల్యాణ్‌తో ప్రేమపక్షుల్లా ప్రవర్తిస్తోంది. కెప్టెన్‌గా పవన్ ఆమెను సేవ్ చేయకపోవడంతో ఏడ్చింది. ఆమె భావాలు చూసి పవన్ ఓదార్చడం వీక్షకుల్లో అసహనం పెంచింది. ఇంతలో బయట మహేశ్ భార్య గౌతమి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను గర్భంతో ఉండగా మహేశ్ రీతూతో క్లోజ్‌గా ఉన్నాడని, అర్ధరాత్రి ఇంటికి తీసుకొచ్చాడని ఆరోపించింది.

Advertisement

సీసీటీవీ వీడియోలు కూడా షేర్ చేసింది. ధర్మ మహేశ్ ( Dharma Mahesh ) స్పందిస్తూ, “నాకు, రీతూకు మధ్య ఏం లేదు. మేము ఫ్రెండ్స్ మాత్రమే” అని స్పష్టం చేశాడు. “ఆమె నా కొడుకును చూపించడం లేదు. డిప్రెషన్‌లో ఉన్నాను” అని బాధపడ్డాడు. గౌతమి తన ఇంటి యజమానికి డ్రగ్స్ వ్యాపారం చేస్తాడని అబద్ధం చెప్పిందని, దాంతో ఇంటి నుంచి ఖాళీ చేయించారని మహేశ్ ఆరోపించాడు. “నేను డ్రగ్స్ ఎప్పుడూ చూడలేదు. కొడుకును నేనే చూసుకుంటాను” అని స్పష్టం చేశాడు.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement