మన పత్రిక, వెబ్డెస్క్
bigg boss 9 telugu contestants: తెలుగు బుల్లితెర ప్రేక్షకుల మధ్య భారీ ఉత్సాహాన్ని కలిగించిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 9, సెప్టెంబర్ 7, 2025 సాయంత్రం 7 గంటలకు స్టార్ మా ఛానెల్ మరియు డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీలో గ్రాండ్ గా ప్రారంభమైంది. సెప్టెంబర్ 6న జరిగిన లాంచ్ షూటింగ్ తర్వాత కంటెస్టెంట్ల జాబితా బయటపడింది.
మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. వీరిలో ఐదుగురు ‘అగ్ని పరీక్ష’ ద్వారా ఎంపికయిన సామాన్యులు (కామనర్స్), తొమ్మిదిగురు ప్రముఖులు (సెలబ్రిటీస్).
అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్:
- మాస్క్ మ్యాన్ హరీష్ (జడ్జ్ బిందు మాధవి సెలెక్షన్)
- దమ్ము శ్రీజ (హీరో నవదీప్ సెలెక్షన్)
- సోల్జర్ పవన్ కల్యాణ్
- మనీష్ మర్యాద (యాంకర్ శ్రీముఖి సెలెక్షన్)
- ప్రియ శెట్టి
సెలబ్రిటీ కంటెస్టెంట్స్:
- తనూజ గౌడ (హీరోయిన్)
- భరణి శంకర్ (సీరియల్ నటుడు)
- ఇమ్మాన్యుయెల్ (జబర్దస్త్ కమెడియన్)
- ఆశా సైనీ (సీనియర్ హీరోయిన్)
- సుమన్ శెట్టి (కమెడియన్)
- సంజన గల్రాని (హీరోయిన్)
- రాము రాథోడ్ (సింగర్)
- శ్రేష్టి వర్మ (కొరియోగ్రాఫర్)
- రీతూ చౌదరి (జబర్దస్త్ బ్యూటీ)
గ్రాండ్ లాంచ్ స్టేజీపై రాము రాథోడ్ సింగింగ్ పర్ఫార్మెన్స్ తో, రీతూ, ఆశ, తనూజ, సంజన డ్యాన్స్ తో, ఇమ్మాన్యుయెల్, సుమన్ శెట్టి ఏవీలతో కంటెస్టెంట్స్ పరిచయం చేసుకున్నారు.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

