Advertisement

బిగ్‌బాస్ ఇంట ప్రియాంక జైన్, శివకుమార్ ఎంగేజ్‌మెంట్

బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్ 66వ రోజు ఎపిసోడ్ కుటుంబ సభ్యుల రాకతో భావోద్వేగంగా సాగింది. ఈ ఎపిసోడ్‌లో నటి ప్రియాంక జైన్ హౌస్‌లోకి అడుగుపెట్టి తన కాబోయే భర్త, పోటీదారు అయిన శివకుమార్‌కు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారు. తోటి హౌస్‌మేట్స్ సమక్షంలో వీరిద్దరూ రింగులు మార్చుకుని నిశ్చితార్థం చేసుకున్నారు.

ఈ ఎపిసోడ్‌లో ముకేష్ తల్లి కూడా హౌస్‌లోకి వచ్చి అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కోపాన్ని తగ్గించుకోవాలని ఆమె ముకేష్‌కి సూచించారు. అనంతరం అమాన్ తండ్రి కూడా హౌస్‌లోకి వచ్చి సభ్యులతో కాసేపు సమయం గడిపారు.

Advertisement
Advertisement