Advertisement

అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’ డిసెంబర్‌కు వాయిదా?

అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆల్కహాల్’. ఈ సినిమా థియేట్రికల్ విడుదల వాయిదా పడినట్లు ప్రచారం జరుగుతోంది. మొదట 2026 జనవరి 1న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావించినప్పటికీ, ప్రస్తుతం 2026 డిసెంబర్ 18న ప్రేక్షకు ముందుకు తీసుకువచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

మెహర్ తేజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో అల్లరి నరేష్ వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నారు. రుహానీ శర్మ, నిహారిక ఎన్ఎమ్ కథానాయికలుగా నటిస్తుండగా, సత్య, హర్షవర్ధన్, గిరీష్ కులకర్ణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. సిితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement
Advertisement