మన పత్రిక వెబ్‌డెస్క్, హైదరాబాద్: ఇటీవల సెలబ్రిటీల ఈవెంట్లలో భద్రతా ప్రమాణాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. అభిమానం హద్దులు దాటితే ప్రమాదమేనన్న వాస్తవం మరోసారి వెలుగులోకి వచ్చింది. తాజాగా బిగ్‌బాస్ ఫేమ్ తనూజకు హైదరాబాద్‌లో చేదు అనుభవం ఎదురైంది. నగరంలో జరిగిన ఓ ఈవెంట్‌కు హాజరైన ఆమెను చూసేందుకు ఫ్యాన్స్ ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. తనను చుట్టుముట్టిన అభిమానులను ఉద్దేశించి “మీ కోసమే వచ్చాను, దయచేసి తోయొద్దు” అని ఆమె ఎంతగా వేడుకున్నా పరిస్థితి అదుపులోకి రాలేదు.
వరుస ఘటనలతో ఆందోళన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజెన్లు తీవ్రంగా స్పందిస్తూ, ఇది అభిమానం కాదని, బాధ్యతలేని ప్రవర్తన అని విమర్శిస్తున్నారు. గతంలోనూ పలువురు స్టార్లకు ఇలాంటి ఇబ్బందులు తప్పలేదు. లుల్లు మాల్లో నిధి అగర్వాల్‌పై జనం దూసుకెళ్లడం, ఓ షాప్ ఓపెనింగ్‌లో సమంత చీరను తొక్కడంతో ఆమె కిందపడే ప్రమాదం రావడం వంటి ఘటనలు అప్పట్లో కలకలం రేపాయి. ఇటీవల అల్లు అర్జున్ తన భార్య స్నేహాతో కలిసి హైటెక్ సిటీలోని నీలోఫర్ కేఫ్‌కు వెళ్లినప్పుడు కూడా అభిమానులు సెల్ఫీల కోసం కారును చుట్టుముట్టడంతో ఇబ్బంది పడ్డారు.
ఎవరీ తనూజ? ఈ ఘటనతో వార్తల్లో నిలిచిన తనూజ పూర్తి పేరు తనూజ పుట్ట స్వామి. కన్నడ, తెలుగు సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, 2013లో కన్నడ హారర్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. జీ తెలుగులో ప్రసారమైన ‘ముద్దమందారం’ సీరియల్ ఆమెకు విశేష ఆదరణ తెచ్చిపెట్టింది. 1500 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ సీరియల్ ఆమె కెరీర్లో మైలురాయిగా నిలిచింది. ఆ క్రేజ్‌తోనే తెలుగు బిగ్‌బాస్ 9లో పాల్గొని రన్నరప్‌గా నిలిచారు. ఈ సీజన్లో కళ్యాణ్ పడాలా విజేతగా నిలిచారు.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
