మన పత్రిక, వెబ్‌డెస్క్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం వెలుగుచూసింది. స్థానిక ఎస్సీ బాలికల గురుకులంలో వార్డెన్ భవాని ఓ విద్యార్థినిపట్ల అమానుషంగా ప్రవర్తించింది. విద్యార్థినిని తన గదికి పిలిపించుకుని కర్రతో విచక్షణారహితంగా కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగుతోంది.
ప్రతిరోజూ ఏదో ఒక సాకుతో వార్డెన్ తమను ఇలాగే హింసిస్తోందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఆందోళన చేపట్టి, వార్డెన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
