Advertisement

భోగాపురంలో: ఉత్తరాంధ్రకు పండుగ రోజు.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

మన పత్రిక, వెబ్​డెస్క్: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసులకు ఇదొక మర్చిపోలేని రోజు. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం (జనవరి 4) తొలి విమానం (ట్రయల్ రన్) విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా టెస్ట్ ఫ్లైట్ ఉదయం 11 గంటలకు సురక్షితంగా దిగడంతో అధికారుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

వచ్చే జూన్ నాటికి మిగిలిన 4 శాతం పనులు పూర్తి చేసి, 2026 జూన్ నుంచి పూర్తి స్థాయి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభిస్తామని సీఎం స్పష్టం చేశారు. 18 నెలల్లో పనులు పూర్తి కావడానికి సహకరించిన ప్రధాని మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇది ఏపీకి ఒక మైలురాయి అని మంత్రి లోకేశ్ అభివర్ణించారు.

Advertisement
Advertisement