Advertisement

లోయలో పడ్డ యాసిడ్ లారీ.. డ్రైవర్ మృతి.

మన పత్రిక, వెబ్​డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా ములకలపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. కాకినాడ నుంచి పాల్వంచకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ లోడ్‌తో వెళ్తున్న భారీ లారీ, పాములేరు వాగు బ్రిడ్జి వద్ద అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్ పూర్తిగా నుజ్జునుజ్జయింది.

సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. అయితే లారీలో ప్రమాదకరమైన యాసిడ్ ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. సుమారు 8 గంటల పాటు శ్రమించి లారీని వెలికితీసే ప్రయత్నం చేసినప్పటికీ, క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను ప్రాణాలతో కాపాడలేకపోయారు. చివరకు అతడు మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు.

Advertisement

ప్రమాదానికి నిద్రమత్తు కారణమా లేక సాంకేతిక లోపమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యాసిడ్ లీకేజీ వల్ల స్థానికులకు ఇబ్బంది కలగకుండా అధికారులు జాగ్రత్తలు చేపట్టారు.

Advertisement