మన పత్రిక, బెంగళూరు: సర్‌ప్రైజ్ పేరుతో ప్రియుడిని ఓ యువతి సజీవదహనం చేసిన దారుణ ఘటన బెంగళూరు నగరంలో వెలుగుచూసింది. ఈ కిరాతక చర్యలో 27 ఏళ్ల కిరణ్ మంటల్లో కాలిపోయి ప్రాణాలు కోల్పోయాడు. నిందితురాలు ప్రేమను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఒకే టెలికాం స్టోర్‌లో పనిచేస్తున్న వీరిద్దరూ ఏడాదిగా ప్రేమలో ఉన్నారు. పెళ్లి చేసుకోకుండా కిరణ్ తనను నిర్లక్ష్యం చేస్తున్నాడనే అనుమానంతో ఆమె ఈ హత్యకు పథకం వేసింది. మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరణ్‌ను రప్పించి, కళ్లకు గంతలు కట్టి కుర్చీకి బంధించింది. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించడమే కాకుండా, కాలిపోతున్న దృశ్యాలను మొబైల్‌లో వీడియో తీయడం కలకలం రేపింది.
మొదట ఈ దారుణాన్ని ప్రమాదంగా చిత్రించేందుకు నిందితురాలు ప్రయత్నించింది. అయితే పోలీసుల అనుమానంతో చేసిన విచారణలో అసలు నిజం అంగీకరించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
