నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కి 340 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసివున్నారు. దాంట్లో 175 ఖాళీలు ఎలక్ట్రానిక్స్ విభాగానికి, 109 మెకానికల్ విభాగానికి, 42 కంప్యూటర్ సైన్స్ విభాగానికి, 14 ఎలక్ట్రికల్ విభాగానికి అవకాశం కల్పిస్తున్నారు.దీనికి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 24 అక్టోబర్ 2025 నుంచి 14 నవంబర్ 2025 వరకు లింక్ ఆక్టివ్ లో ఉంటుంది.
ఈ జాబ్స్ E -II గ్రేడ్ గా పరిగణించి అభ్యర్ధులకు దానికి అనుగుణం గా జీతభత్యాలు అందిస్తారు.ఈ జాబ్స్ అప్లై చేయడానికి వయో పరిమితి 25 సంవత్సరాలుగా నిర్ణయించారు. అభ్యర్ధులను కంప్యూటర్ ఆధారిత మరియు ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన అభ్యర్ధులకు 40,000 నుంచి 1,40,000 వరకు ఇస్తారు.
ఆన్లైన్ లో అప్లై చేయడానికి GEN/OBC(NCL)/EWS వాళ్ళకు 1000 రూపాయలు మరియు SC/ST/ PwBD/ESM పరీక్ష ఫీజు నుంచి మినహాయించారు. B.E/B.Tech ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ఇతర ముఖ్యమైన సమాచారం కొరకు ఈ క్రింది వెబ్సైట్ ను సందర్శించండి.https://bel-india.in/
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

