మన పత్రిక, వెబ్డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న బీసీ ఉద్యోగుల వివరాలను సెప్టెంబర్ 15, 2025లోగా బీసీ కమిషన్‌కు అందజేయాలని కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ అధికారులకు సూచించారు.
TELANGANA BC EMPLOYEES NEWS
6 నెలల క్రితం ఇచ్చిన ఆదేశాల మేరకు పూర్తి సమాచారం అందుబాటులో లేకపోవడంతో ఈ సూచనలు జారీ చేశారు. ఇక ముందు ప్రతి సంవత్సరం మార్చి 31న బీసీ ఉద్యోగుల సమగ్ర సమాచారం కమిషన్‌కు అందించాలని నిర్ణయించారు.
Advertisement
కమిషన్ సేకరించే సమాచారం ఆధారంగా బీసీ వర్గాల సామాజిక, విద్యా, ఆర్థికాభివృద్ధికి సంబంధించి ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తామని నిరంజన్ పేర్కొన్నారు.
కొన్ని చిన్న బీసీ కులాలకు అవకాశాలు సరిగా లభించడం లేదని, పెద్ద కులాలే ఎక్కువగా ప్రయోజనాలు పొందుతున్నాయని ఆయన తెలిపారు. దీంతో బీసీ రిజర్వేషన్లు, బీసీ జాబితాను పునర్వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు.
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
- బెంగళూరు: 2 నిమిషాలు లేటని విద్యార్థికి ఎండలో శిక్ష
- ఇరాన్ క్షిపణి దాడులు: దుబాయ్ ఎయిర్పోర్ట్ మూసివేత
- సినిమాను దెబ్బతీయడానికే మోనాలిసా పెళ్లి: దర్శకుడు సనోజ్
ఇవి కూడా చదవండి :
Advertisement
