Advertisement

Bathukamma: తెలంగాణ మహిళల ఘన సంబరాలు

చివరి రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా తెలంగాణ మహిళలు ఒక్కచోట చేరి ఆడిపాడుతూ సంబరాలు ( Bathukamma Celebrations ) చేసుకుంటున్నారు. తీరొక్క పూలతో భక్తిశ్రద్ధలతో బతుకమ్మలు పేర్చారు. హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్, సరూర్‌నగర్ పరిసరాలు వెలుగులీనుతున్నాయి. వందలాది మంది మహిళలు ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ కలిసి నృత్యం చేస్తున్నారు. హనుమకొండ, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ తదితర ప్రాంతాల్లో కూడా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆడుతున్నారు. తెలంగాణ సంస్కృతికి అద్దంపడే ఈ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.

Advertisement