WhatsApp
Advertisement

కరెంట్ షాక్‌తో కొడుకు, రైలు కింద పడి తండ్రి మృతి

మన పత్రిక, వెబ్​డెస్క్: బాపట్ల జిల్లా వేమూరు మండలం బేతాళపురంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌తో కొడుకు మరణించగా, ఆ బాధను తట్టుకోలేక తండ్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకే రోజు తండ్రీకొడుకులు మృతి చెందడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది.

వివరాల్లోకి వెళ్తే.. అట్లూరి సునీల్ అనే యువకుడు పొలంలో ఎరువులు దించుతుండగా విద్యుత్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. సునీల్‌కు ఏడాది క్రితమే వివాహం కాగా, భార్య ప్రస్తుతం 9 నెలల గర్భవతి. పరిహారం కోసం స్థానికులు ఆందోళన చేయడంతో విద్యుత్ శాఖ, సదరు రైతు ఆర్థిక సాయం చేసేందుకు అంగీకరించారు. అయితే, కొడుకు మరణవార్త విని తట్టుకోలేకపోయిన సునీల్ తండ్రి, తీవ్ర మనస్తాపంతో వేమూరు రైల్వే ట్రాక్‌పై రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Advertisement
Advertisement