Advertisement

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 514 ఆఫీసర్ పోస్టులు.. దరఖాస్తుకు నేడే లాస్ట్ ఛాన్స్!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగులకు ముఖ్య గమనిక. బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI)లో 514 క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో (జనవరి 5, 2026) ముగియనుంది. స్కేల్-2, 3, 4 కేటగిరీల్లో ఉన్న ఈ ఖాళీలకు అర్హులైన అభ్యర్థులు వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఏదైనా డిగ్రీతో పాటు CA, CFA లేదా MBA (Finance/Banking) పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఆసక్తి గలవారు bankofindia.bank.in వెబ్‌సైట్ సందర్శించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు.

Advertisement
Advertisement