మన పత్రిక, హైదరాబాద్: బండి సంజయ్ కుమార్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు దర్యాప్తును తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. రేవంత్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ప్రతి అంశాన్ని అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు.
అయితే, గత మూడు రోజులుగా భగీరథ్ ఆచూకీ లేనట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన మొబైల్ స్విచ్ఛాఫ్ చేసి బయట ప్రపంచంతో సంబంధాలు నిలిపివేయడంతో, పోలీసులకు ఆచూకీ దొరకడం కష్టంగా మారిందని ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ధృవీకరణ వెలువడాల్సి ఉంది. చట్టపరమైన చర్యల్లో సడలింపులు ఉంటే ప్రజా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తుండటంతో, ప్రభుత్వం వెనక్కి తగ్గే పరిస్థితి లేదు.
ఈ వ్యవహారానికి పార్టీకి సంబంధం లేదని తెలంగాణ బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. రామచందర్ రావు సహా పలువురు నేతలు దీనిని వ్యక్తిగత అంశంగా చూస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆరోపణలు, ప్రతిఆరోపణలపై ప్రస్తుతం పోలీసుల అధికారిక దర్యాప్తు కొనసాగుతోంది.
