మన పత్రిక వెబ్‌డెస్క్, న్యూఢిల్లీ: కేవలం పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే యువతకు శుభవార్త. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా (AWBI) మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో ప్రచురితమైన ఈ నోటిఫికేషన్ ప్రకారం ఆఫ్‌లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యమైన వివరాలు:
Advertisement
- పోస్టు పేరు: మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS)
- విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి (మెట్రిక్యులేషన్) పాసై ఉండాలి.
- వయోపరిమితి: అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. (నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోసడలింపు ఉంటుంది).
- దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్. అధికారిక వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని, పూర్తి చేసి, అవసరమైన ధ్రువపత్రాలను జతచేసి హర్యానాలోని బల్లబ్‌గఢ్ ఆఫీస్‌కు పోస్ట్ ద్వారా పంపాలి.
- దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31, 2026.
- అధికారిక వెబ్సైట్: awbi.gov.in/notifications
ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్ పీడీఎఫ్‌ను క్షుణ్ణంగా చదివి సకాలంలో దరఖాస్తులు పంపుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- శత్రువులకు ఆశ్రయమిస్తే వదిలిపెట్టం.. గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకర దాడులు!
- విడాకుల వివాదం, త్రిషతో రూమర్లు.. తొలిసారి నోరువిప్పిన దళపతి విజయ్!
- అబుదాబి దాడుల్లో సిరిసిల్ల యువకుడికి గాయాలు.. ఆందోళనలో కన్నవారు!
- పొరుగు దేశాలకు ఇరాన్ క్షమాపణలు.. కానీ ఆ విషయంలో తగ్గేదే లేదన్న అధ్యక్షుడు!
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో విమాన సేవలు బంద్.. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఎమిరేట్స్ కీలక నిర్ణయం!
Advertisement
