Today Rasi Phalalu : 8 March 2026 ఆదివారం రాశి ఫలితాలు!

మన పత్రిక వెబ్​డెస్క్: నేటి రాశి ఫలాలు (08 మార్చి 2026). మేషం, వృషభం, మిథునం, కర్కాటకం తదితర 12 రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ఎవరికి అదృష్టం, ఎవరికి కష్టాలు? పూర్తి వివరాలు మేష రాశి: ఈ వారం ఆర్థిక విషయాల్లో మీకు మంచి పురోగతి కనిపిస్తుంది. పెట్టుబడుల్లో విజయం సాధిస్తారు. కొత్త ప్రాజెక్టుల కోసం కొత్త మార్గాలు అన్వేషిస్తారు. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారు సానుకూల నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తారు. కుటుంబ సభ్యులతో … Read more

శత్రువులకు ఆశ్రయమిస్తే వదిలిపెట్టం.. గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకర దాడులు!

మన పత్రిక వెబ్​డెస్క్, టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయెల్‌లతో ఇరాన్ పోరు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ఇరాన్‌పై దాడులు చేయడానికి అమెరికా బలగాలకు ఆశ్రయం కల్పిస్తున్న పొరుగు (గల్ఫ్) దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. శత్రువులకు తమ భౌగోళిక ప్రాంతాన్ని వాడుకునేలా అవకాశం ఇస్తున్న దేశాలపై ఈ భీకర దాడులు కొనసాగుతాయని ఇరాన్ న్యాయశాఖ ప్రధాన న్యాయమూర్తి, తాత్కాలిక నాయకత్వ మండలి సభ్యుడు గులాంహుస్సేన్ మొహ్సేని ఎజెయి స్పష్టం చేశారు. శనివారం తెల్లవారుజామున, మధ్యాహ్నం యూఏఈ, బహ్రెయిన్, ఖతార్, సౌదీ … Read more

10వ తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. AWBI లో MTS పోస్టులు!

మన పత్రిక వెబ్​డెస్క్, న్యూఢిల్లీ: కేవలం పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే యువతకు శుభవార్త. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా (AWBI) మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో ప్రచురితమైన ఈ నోటిఫికేషన్ ప్రకారం ఆఫ్‌లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమైన వివరాలు: ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్ పీడీఎఫ్‌ను క్షుణ్ణంగా చదివి సకాలంలో దరఖాస్తులు పంపుకోవాలని అధికారులు … Read more

విడాకుల వివాదం, త్రిషతో రూమర్లు.. తొలిసారి నోరువిప్పిన దళపతి విజయ్!

మన పత్రిక వెబ్​డెస్క్, చెన్నై: ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) అధినేత, స్టార్ హీరో దళపతి విజయ్ తన వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న పరిణామాలపై తొలిసారి స్పందించారు. భార్య సంగీత విడాకుల పిటిషన్, హీరోయిన్ త్రిషతో ఎఫైర్ రూమర్ల నడుమ.. శనివారం (మార్చి 7) పార్టీ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ప్రసంగంలో పర్సనల్ లైఫ్ గురించి ప్రస్తావిస్తూ.. “ఇటీవల నన్ను చుట్టుముట్టిన సమస్యల కోసం నేను … Read more

అబుదాబి దాడుల్లో సిరిసిల్ల యువకుడికి గాయాలు.. ఆందోళనలో కన్నవారు!

మన పత్రిక వెబ్​డెస్క్, రాజన్న సిరిసిల్ల: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, దాడుల సెగ తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చేరింది. అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో జిల్లాలోని పోతిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఎన్. రాజేశ్వరరావుకు గాయాలయ్యాయి. గత ఏడాదిగా అబుదాబి ఎయిర్‌పోర్ట్‌లో హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేస్తున్న రాజేశ్వరరావు.. ఈ దాడుల్లో తృటిలో ప్రాణాపాయం తప్పించుకున్నాడు. వీడియో కాల్ ద్వారా తమతో మాట్లాడినప్పటికీ, గాయాలను మాత్రం చూపించలేదని ఆయన తండ్రి ప్రభాకర్ రావు కన్నీటిపర్యంతమయ్యారు. తన … Read more

పొరుగు దేశాలకు ఇరాన్ క్షమాపణలు.. కానీ ఆ విషయంలో తగ్గేదే లేదన్న అధ్యక్షుడు!

మన పత్రిక వెబ్​డెస్క్ : అమెరికా, ఇజ్రాయెల్‌తో జరుగుతున్న భీకర యుద్ధం నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక ప్రకటన చేశారు. ఇటీవల తమ దాడుల వల్ల నష్టపోయిన గల్ఫ్ పొరుగు దేశాలకు ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఆయా దేశాల భూభాగం నుంచి ఇరాన్‌పై దాడులు జరగనంత వరకు, తమ వైపు నుంచి కూడా ఎలాంటి క్షిపణులు ప్రయోగించబోమని.. ఇందుకు ఇరాన్ తాత్కాలిక నాయకత్వ మండలి అంగీకరించిందని ప్రభుత్వ టీవీ ద్వారా వెల్లడించారు. అదే … Read more

దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో విమాన సేవలు బంద్.. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఎమిరేట్స్ కీలక నిర్ణయం!

మన పత్రిక వెబ్​డెస్క్, దుబాయ్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇరాన్ దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (DXB) శనివారం తన విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. విమానాశ్రయ పరిసరాల్లో గాలిలోనే ఓ అనుమానాస్పద వస్తువును (క్షిపణి/డ్రోన్) అడ్డుకోవడంతో దాని శకలాలు కిందపడ్డాయి. మొదట ఇది పేలుడుగా భావించినప్పటికీ.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, పరిస్థితి అదుపులోనే ఉందని దుబాయ్ మీడియా ఆఫీస్ స్పష్టం చేసింది. అయితే, ప్రయాణికులు, ఎయిర్‌లైన్ సిబ్బంది భద్రత దృష్ట్యా … Read more

ఎస్సెస్సీ జేఈ టైర్-1 స్కోర్ కార్డ్.. మీ మార్కులు ఇలా చెక్ చేసుకోండి!

మన పత్రిక వెబ్​డెస్క్, న్యూఢిల్లీ: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూనియర్ ఇంజనీర్ (JE) టైర్-1 పరీక్షకు సంబంధించిన స్కోర్ కార్డులు త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్నాయి. మార్చి 6న టైర్-1 ఫలితాలను ప్రకటించిన కమిషన్.. మార్చి నెలలోనే అభ్యర్థుల మార్కుల వివరాలతో కూడిన స్కోర్ కార్డును విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో మొత్తం 1,731 ఖాళీల భర్తీకి గతేడాది డిసెంబర్ 3 నుంచి 6 వరకు టైర్-1 (కంప్యూటర్ … Read more

సింహ రాశి వారికి రాజయోగం.. ఆ మూడు రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి!

మన పత్రిక వెబ్​డెస్క్, సిరిసిల్ల: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం నేటి (శనివారం, మార్చి 7, 2026) రాశి ఫలాలు మీ కోసం. నేటి గ్రహస్థితులు, నక్షత్ర సంచారం (ఉదయం 11:12 వరకు చిత్తా, ఆ తర్వాత స్వాతి) ఆధారంగా ద్వాదశ రాశుల (12 రాశులు) వారి దైనందిన జీవితం ఎలా ఉండబోతోంది? ఎవరికి వ్యాపార లాభాలు, ఎవరికి ఉద్యోగంలో ఒత్తిడి, ఏ రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనే పూర్తి … Read more

బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి ఫిక్స్.. లాయర్ ఇంటి అల్లుడు కానున్న యంగ్ హీరో!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: టాలీవుడ్ లో మరో కుర్ర హీరో త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు, యంగ్ హీరో సాయి శ్రీనివాస్ వివాహం నిశ్చయమైనట్లు ఫిల్మ్ నగర్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌కే చెందిన న్యాయవాదుల కుటుంబానికి చెందిన ‘కావ్య రెడ్డి’ అనే యువతితో ఆయన ఏడడుగులు నడవనున్నారని సమాచారం. ఆమె తాత రిటైర్డ్ జడ్జి కాగా, తండ్రి ప్రస్తుతం లాయర్ గా కొనసాగుతున్నారు. ఈ వారంలోనే … Read more