Advertisement

శ్రీకాకుళం జిల్లా ప్రతిష్టను దెబ్బతీశారు: మంత్రి అచ్చెన్నాయుడు

మన పత్రిక: శ్రీకాకుళం జిల్లా ప్రతిష్టను కొందరు దెబ్బతీశారని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. జిల్లాలో చోటుచేసుకున్న తమ్మినేని భూ భాగోతాలపై సమగ్ర విచారణ జరపాలని తాము ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. బతికున్న వ్యక్తిని చనిపోయినట్లుగా రికార్డుల్లో చూపించడం చాలా దారుణమైన విషయమని ఆయన వ్యాఖ్యానించారు.

మరోవైపు, పొగాకు మరియు ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం కేంద్రం సానుకూలంగా స్పందించిందని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. రైతులకు మేలు జరిగేలా కేంద్ర ప్రభుత్వం నుండి స్పందన లభించిందని ఆయన పేర్కొన్నారు.

Advertisement
Advertisement