Artificial beach in hyderabad | డిసెంబర్ నుంచి ప్రారంభం, రూ.225 కోట్ల ప్రాజెక్ట్

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. సముద్రం లేని నగరంలో ఇప్పుడు బీచ్ సౌకర్యం రాబోతోంది. కొత్వాల్ గూడ లో ( Hyderabad artificial beach project cost ) రూ.225 కోట్లతో కృత్రిమ బీచ్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది ( kotwali guda beach ) . ఈ ప్రాజెక్టు డిసెంబర్ 2024 నుంచి ప్రారంభమవుతుంది.పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) పద్ధతిలో దాదాపు 35 ఎకరాల్లో ఈ కృత్రిమ బీచ్ అభివృద్ధి చేయనున్నారు. ఇది హైదరాబాద్ పర్యాటక రంగానికి కొత్త మలుపు ఇస్తుందని అధికారులు భావిస్తున్నారు.

ఈ కృత్రిమ బీచ్‌లో పర్యాటకులను ఆకర్షించేందుకు అనేక ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఫ్లోటింగ్ విల్లాస్, లగ్జరీ హోటళ్లు, వేవ్ పూల్స్, అత్యాధునిక థియేటర్లతో పాటు వివిధ రకాల వంటకాలను అందించే ఫుడ్ కోర్టులు కూడా ఉంటాయి. ఇది కేవలం పర్యాటక కేంద్రం మాత్రమే కాకుండా, నగరవాసులకు విలాసవంతమైన విహార ప్రదేశంగా కూడా పనిచేస్తుంది. ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ పర్యాటక రంగంలో కొత్త స్థాయికి చేరుకుంటుందని అంచనా. ఈ ప్రాజెక్టు వల్ల కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయి. పర్యాటకుల సంఖ్య పెరగడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతం లభిస్తుంది. ఇకపై బీచ్ కోసం గోవా, విజయవాడ లేదా విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ లోనే బీచ్ అనుభవం సాధ్యమవుతోంది.