Arattai App: ‘అరట్టై’ అంటే తమిళంలో ‘మాట్లాడుకోవడం’. 2021లోనే జోహో కార్పొరేషన్ ( Zoho Corporation ) లాంచ్ చేసిన ఈ యాప్, ఇప్పుడు అందరి మనసుల్లో ఒక ప్రశ్నగా మారింది – “వాట్సప్ కిల్లర్?” వన్-టు-వన్ చాట్స్, గ్రూప్ మెసేజెస్, వాయిస్ నోట్స్, ఫొటో/వీడియో షేరింగ్, స్టోరీస్, బ్రాడ్‌కాస్ట్ ఛానల్స్ – అన్నీ ఒకే యాప్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఇది కేవలం మెసేజింగ్ యాప్ కాదు. టెక్స్ట్, మీడియా, ఫైల్ షేరింగ్, ఆడియో, వీడియో కాల్స్ (ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ తో), డెస్క్‌టాప్, ఆండ్రాయిడ్-టీవీ ఇంటిగ్రేషన్ తో కూడిన మల్టీ డివైజ్ సపోర్ట్ – అన్నీ ఇందులో ఉన్నాయి. వ్యాపారుల కోసం బేసిక్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రైవసీ ప్రాధాన్యం ఇచ్చే ఈ యాప్, వ్యక్తిగత డేటాను మోనిటైజ్ చేయబోమని జోహో స్పష్టం చేసింది.
మూడు రోజుల్లో 100 రెట్లు వృద్ధి సాధించడం ఒక అద్భుతం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఈ యాప్ ను ప్రోత్సహించడంతో డౌన్‌లోడ్లు భారీగా పెరిగాయి. ఆండ్రాయిడ్, యాపిల్ యాప్ స్టోర్లలో నెట్‌వర్కింగ్ విభాగంలో అరట్టై నంబర్-1 స్థానంలో నిలిచింది. సోషల్ మీడియాలో ఈ యాప్ పై చర్చలు మరింత వేడెక్కాయి.
ఇంకా పెరుగుదల కోసం జోహో టీమ్ ఎమర్జెన్సీ బేసిస్ లో సర్వర్లను పెంచుతోంది. నెల ముందే ఈ యాప్ ను నవంబర్ లో అదనపు ఫీచర్లతో పెద్ద ఎత్తున రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, యూజర్ల విపరీతమైన ఆదరణ వల్ల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విస్తరణపై దృష్టి సారించారు. ఓటీపీ ఆలస్యం, కాంటాక్ట్ సింక్ సమస్యలు, కాల్ ఫెయిల్యూర్లు వంటి ఇబ్బందులు కొందరు యూజర్లు రిపోర్ట్ చేస్తున్నారు. దీన్ని జోహో అంగీకరించి, త్వరలోనే పరిష్కరిస్తామని పేర్కొంది.
వాట్సప్ కి పోటీ? భారత్ లో 50 కోట్లకు పైగా యూజర్లు ఉన్న వాట్సప్ కి అరట్టై ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. కాల్స్ ఎన్‌క్రిప్టెడ్ అయినా, చాట్స్ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ లేకపోవడం ఇప్పుడు ఒక తేడాగా కనిపిస్తోంది. అయితే, జోహో తన ప్రైవసీ ప్రామిస్ ని త్వరగా అమలు చేస్తూ, మౌలిక సదుపాయాలను విస్తరించుకుంటే, ఇది వాట్సప్ కి గట్టి పోటీ ఇవ్వగలదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

