Advertisement
APPSC Junior Accountant Notification 2025

APPSC జూనియర్ అకౌంటెంట్ నోటిఫికేషన్: 11 ఖాళీలు, డిగ్రీ అర్హత, జీతం ₹25,220 నుంచి ₹1.27 లక్షలు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) మున్సిపల్ అకౌంట్స్ సబార్డినేట్ సర్వీస్‌లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. మొత్తం 11 ఖాళీలు. ఏదైనా డిగ్రీ ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చివరి తేదీ – అక్టోబర్ 29, 2025.

Advertisement

పోస్టులు & ఖాళీలు:

Advertisement
  • జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, కేటగిరీ-II – 1 ఖాళీ
  • సీనియర్ అకౌంటెంట్, కేటగిరీ-III – 1 ఖాళీ
  • జూనియర్ అకౌంటెంట్, కేటగిరీ-IV – 9 ఖాళీలు
    మొత్తం ఖాళీలు: 11

అర్హత:

  • భారతదేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/బోర్డు నుండి ఏదైనా డిగ్రీ (B.Com ముఖ్యం).
  • 01.07.2025 నాటికి 18–42 సంవత్సరాల వయస్సు ఉండాలి. SC/ST/BC/PwBD/Ex-Servicemen అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతం:

Advertisement
  • జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, కేటగిరీ-II: ₹44,570 – ₹1,27,480
  • సీనియర్ అకౌంటెంట్, కేటగిరీ-III: ₹34,580 – ₹1,07,210
  • జూనియర్ అకౌంటెంట్, కేటగిరీ-IV: ₹25,220 – ₹80,910

దరఖాస్తు ఫీజు:

  • సాధారణ/OC/EWS: ₹250 + ₹80 = ₹330
  • SC/ST/BC/PwBD/మహిళలు/మాజీ సైనికులు: ₹250 (పరీక్ష రుసుము మినహాయింపు)

దరఖాస్తు తేదీలు:

  • ప్రారంభం: 09 అక్టోబర్ 2025
  • చివరి తేదీ: 29 అక్టోబర్ 2025 (రాత్రి 11:59 గంటల వరకు)

ఎంపిక విధానం:
రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక.

ఎలా దరఖాస్తు చేయాలి?
https://psc.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి. ఒక్కసారి అప్లై చేస్తే, మీ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగం వస్తుంది.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement